Allu Arjun: వారెవా...ఏమి స్టిల్ గురూ...!.. అల్లు అర్జున్ పోజుపై నెటిజన్ల ఫిదా

  • నా పేరు సూర్య సినిమా లేటెస్ట్ పోస్టర్‌కి ఆదరణ
  • అల్లు అర్జున్ పోజు అదిరిపోయిందంటూ ట్వీట్లు
  • సోషల్ మీడియాలో తెగ వైరల్

రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా' చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఆ చిత్రంపై అంచనాలు ఊపందుకుంటున్నాయి. ఈ సినిమాకి సంబంధించి గతంలో విడుదలయిన ట్రైలర్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా "ఇక్కడ కాదు..బోర్డర్‌లో చనిపోతా" అంటూ బన్నీ చెప్పే డైలాగ్‌కి ఆయన అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమా కచ్చితంగా హిట్టేనంటూ వారు కాన్ఫిడెంట్‌గా చెప్పేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఈ సినిమాకి సంబంధించి తాజాగా విడుదలయిన పోస్టర్ అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ స్టిల్ చూసి అల్లు ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు 'వారెవా ఏమి స్టిల్ గురూ..అదుర్స్' అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఆర్మీ జీపులో స్టీరింగ్ పట్టుకుని స్టైల్‌గా నోట్లో చుట్ట పెట్టుకుని బన్నీ ఇచ్చిన పోజు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Allu Arjun
Naa peru Surya Naa Illu India
Vakkantam vamsi
  • Error fetching data: Network response was not ok

More Telugu News