Shahid Kapoor: సైడ్ డాన్సర్ నుంచి స్టార్‌గా ఎదిగిన బాలీవుడ్ హీరో
- తొలినాళ్లలో షాహీద్ కపూర్ 'సైడ్' పాత్రలు
- జబ్ వుయ్ మెట్, కమీనే చిత్రాలతో స్టార్‌గా గుర్తింపు
- పద్మావత్ చిత్రంతో నటుడిగా మరో మెట్టు పైకి
సినిమా పరిశ్రమలో ఎదగాలంటే అంత ఈజీ కాదని అందరూ చెబుతుంటారు. కేవలం బ్యాగ్రౌండ్ ఉంటేనే సరిపోదు. అది చక్కటి లాంచింగ్ ప్యాడ్‌గా మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత స్వయంకృషిపైనే నిలబడేది...లేక చతికిలపడేది. సపోర్టింగ్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి మెట్టుమెట్టుకు ఎదుగుతూ 'వారెవా...! స్టార్ అంటే' ఇలా ఉండాలనే స్థాయికి చేరుకున్న వారు చాలామందే ఉన్నారు. తెలుగులో చిరంజీవి, రవితేజ లాంటి నటులు ఆ కోవకు చెందినవారే.
ఇలాంటి పరిస్థితులు బాలీవుడ్‌లోనూ కనిపిస్తాయి. జబ్ వుయ్ మెట్, కమీనేతో పాటు తాజాగా పద్మావత్ చిత్రంతో స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో షాహీద్ కపూర్. బాలీవుడ్‌లో 'కపూర్'లకు బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ, ఈ కమీనే హీరో కెరీర్ ఆరంభంలో గుంపులో గోవింద మాదిరిగా సైడ్ డాన్సర్‌గా నటించాడు. అలాంటి షాహీద్ నేడు బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడుగా వెలుగుతున్నాడు. కష్టేఫలే అంటే ఇదే మరి...!