Special Category Status: పవన్ ఒక్కోసారి మాట్లాడుతున్నారు, ఒక్కోసారి మౌనంగా ఉంటున్నారు.. పోరాడాలి: 'హోదా'పై శివాజీ

  • పోరాడకుండా ప్రత్యేక హోదాను సాధించలేం
  • బీజేపీతో కలిసి టీడీపీ, వైసీపీలు నాటకాలు ఆడుతున్నాయి
  • ప్రత్యేక హోదా కోసం రోడ్లపైకి వచ్చి పోరాడాలి  

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా కోసం గుంటూరు జిల్లాలో ఈ రోజు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకి చలసాని శ్రీనివాస్, సీపీఐ రామకృష్ణ, సినీనటుడు శివాజీతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు.

పోరాడకుండా ప్రత్యేక హోదాను సాధించలేమని శివాజీ చెప్పారు. బీజేపీతో కలిసి టీడీపీ, వైసీపీలు నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై ఒక్కోసారి మాట్లాడుతున్నారని, ఒక్కోసారి మౌనంగా ఉంటున్నారని ఆయన విమర్శించారు. పవన్ కూడా వచ్చి పోరాడితే బాగుంటుందని అన్నారు.

Special Category Status
shivaji
Andhra Pradesh
Pawan Kalyan
  • Loading...

More Telugu News