Stock Market: నిలకడగా ట్రేడ్ అవుతోన్న స్టాక్ మార్కెట్లు

  • లాభాల్లో ఐడీబీఐ, దాల్మియా భారత్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్
  • నష్టాల్లో విక్రాంజీ, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, ఇండియన్ బ్యాంక్
  • సెన్సెక్స్ 34197.47 వద్ద, నిప్టీ  10506.45 వద్ద కొనసాగింపు

ఈ రోజు ట్రేడింగ్ ఆరంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్లు మధ్యాహ్నం నుంచి స్థిరంగా స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, దాల్మియా భారత్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ లాంటి కంపెనీల షేర్లకు మదుపర్ల నుంచి డిమాండ్ రావడంతో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు మధ్యాహ్నం నుంచి నిలకడగా లాభాలతో కొనసాగుతున్నాయి.

 1.40 గంటల సమయంలో సెన్సెక్స్ 13.43 పాయింట్ల వృద్ధితో 34197.47 వద్ద, నిఫ్టీ 13.60 పాయింట్ల పెరుగుదలతో 10506.45 వద్ద కొనసాగుతున్నాయి. విక్రాంజీ, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, రెయిన్ ఇండస్ట్రీస్, టోరెంట్ ఫార్మా, ఇండియన్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కాగా, ఉదయం జీడీపీ సానుకూల ప్రభావంతో ప్రధాన సూచీలు లాభాలబాటలో పయనించాయి. అయితే దిగ్గజ కంపెనీల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు మళ్లీ నేలచూపులు చూశాయి.

  • Loading...

More Telugu News