Kathi Mahesh: హీరోగా మహేశ్ సోదరుడి తనయుడు జయకృష్ణ

  • గతంలో హీరోగా చేసిన మహేశ్ అన్నయ్య రమేష్ 
  • నటన పట్ల ఆసక్తి చూపుతోన్న ఆయన తనయుడు
  • నటనలో కొనసాగుతోన్న శిక్షణ  

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేశ్ బాబు దూసుకొచ్చాడు. పరాజయాలకు అతీతంగా ఆయన క్రేజ్ .. మార్కెట్ పెరుగుతూ ఉండటం విశేషం. అలాంటి మహేశ్ బాబు కంటే ముందుగానే ఆయన అన్నయ్య రమేశ్ బాబు తెలుగులో హీరోగా కొన్ని సినిమాలు చేశారు. అయితే ఆ సినిమాలు అంతగా సక్సెస్ ను సాధించకపోవడం వలన, ఆయన సినిమా రంగానికి దూరమయ్యారు.

ఇప్పుడు ఆయన తనయుడు 'జయకృష్ణ' హీరోగా తెలుగుతెరకు పరిచయం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కుర్రాడు వైజాగ్ లో సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. వచ్చే ఏడాది జయకృష్ణతో సినిమా ఉండేలా కృష్ణ ఫ్యామిలీ రంగాన్ని సిద్ధం చేస్తోందట. తాతయ్యలా .. బాబాయ్ లా ఈ కుర్రాడు దూసుకుపోతాడేమో చూడాలి.     

Kathi Mahesh
rameshbabu
  • Loading...

More Telugu News