kala venkatrao: ఎల్లుండి కళా వెంకట్రావు కుమార్తె వివాహం.. హాజరవుతున్న సీఎం

  • ఈనెల 3న విశాఖలో కళా వెంకటరావు కుమార్తె వివాహం
  • ఘనంగా జరుగుతున్న ఏర్పాట్లు
  • హాజరవుతున్న సీఎం, స్పీకర్, మంత్రులు, హైకోర్టు జడ్జిలు

టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు కుమార్తె వివాహం ఈ నెల 3న విశాఖపట్నంలో జరగనుంది. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈ వివాహానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లి వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్నారు. శనివారం సాయంత్రం ఆయన విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి పోర్ట్ గెస్ట్ హౌస్ కు వెళతారు. రాత్రి 9.30 గంటలకు వివాహానికి హాజరవుతారు. అనంతరం అదే రోజు రాత్రి 10 గంటలకు విమానంలో బయల్దేరి గన్నవరం చేరుకుంటారు.

మరోవైపు స్పీకర్ కోడెల కూడా వివాహానికి హాజరై రాత్రికి నొవాటెల్ హోటల్ లో బస చేస్తారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పలువురు రాష్ట్ర మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు, ఐదుగురు హైకోర్టు జడ్జిలు వివాహ వేడుకలకు హాజరవుతారని చెప్పారు.  

kala venkatrao
daughter
marriage
Chandrababu
  • Loading...

More Telugu News