bumrah: బుమ్రా.. అతిగా ఆడకు... జాగ్రత్త తీసుకో: చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్
- బుమ్రాపై పనిభారం ఎక్కువ కాకుండా చూసుకోవాలి
- కీలకమైన సిరీస్ లు ముందున్నాయి
- బుమ్రా గాయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
టీమిండియ్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా మంచి ఫామ్ లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా టూర్ లో మంచి ప్రతిభను కనబరచి, జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ సిరీస్ లో బుమ్రా ఏకంగా 162.1 ఓవర్లు బౌల్ చేశాడు. ఇందులో, మూడు టెస్టుల్లో 112.1 ఓవర్లు వేశాడు.
ఈ సందర్భంగా బుమ్రాకు జాతీయ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కీలక సూచన చేశాడు. బుమ్రా చాలా అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడిన ప్రసాద్... భవిష్యత్తులో చాలా కీలక పర్యటనలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో బుమ్రాపై పనిభారం ఎక్కువ కాకుండా చూసుకోవాలని అన్నాడు. అతను ఎక్కువగా ఆడకుండా చూసుకోవాలని అన్నాడు. బుమ్రా బౌలింగ్ స్టైల్ విభిన్నంగా ఉంటుందని... ఈ నేపథ్యంలో, అతనికి గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. ముఖ్యమైన సిరీస్ లలో మాత్రమే బుమ్రాను ఆడించాలని అన్నాడు. బౌలింగ్ వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని బుమ్రాకు సూచించాడు.