kadapa: కడప వాసులకు శుభవార్త.. విజయవాడకు విమాన సర్వీసులు ప్రారంభం

  • కడప నుంచి విజయవాడకు సర్వీసులు ప్రారంభించిన ట్రూజెట్
  • సర్వీసులను ప్రారంభించిన ఎయిర్ పోర్ట్ డైరెక్టర్
  • ఇప్పటికే ఇక్కడి నుంచి హైదరాబాద్, చెన్నైలకు సర్వీసులు

కడప నుంచి విజయవాడకు ఈరోజు ట్రూజెట్ విమానయాన సంస్థ సర్వీసులను ప్రారంభించింది. ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ శివప్రసాద్ ఈ సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధానికి ట్రూజెట్ సర్వీసులు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. కడపవాసులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇప్పటికే కడప నుంచి హైదరాబాద్, చెన్నైలకు ట్రూజెట్ సర్వీసులు నడుస్తున్నాయి. మరోవైపు, విజయవాడకు ట్రూజెట్ సర్వీసులు ప్రారంభం కావడం పట్ల కడపవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కడపకు ఫ్లైట్ కనెక్టివిటీ పెరుగుతుండటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

kadapa
trujet
service
  • Loading...

More Telugu News