Nayani Krishnamurthy: ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి మృతి

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాయని
  • బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • మాబడి, పాఠశాల మ్యాగజైన్లు నిర్వహించిన కృష్ణమూర్తి

ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో రేపు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, పలు నవలలు, కథలు, ఆధ్యాత్మిక గ్రంథాలను రచించిన ఆయన, మాబడి, పాఠశాల తదితర విద్యా సంబంధ మ్యాగజైన్లను నిర్వహించారు. ఆయన మృతిపై విద్యావేత్తలు, రచయితలు, రాజకీయ నాయకులు సంతాపం వెలిబుచ్చారు.

Nayani Krishnamurthy
Died
Chittoor District
Mabadi
Pathasala
  • Loading...

More Telugu News