America: పోస్టల్ కవర్‌ను తెరిచి అస్వస్థతకు గురైన 11 మంది అమెరికా మిలటరీ సిబ్బంది.. ఉగ్ర చర్యేనా?

  • అమెరికా మిలటరీ బేస్‌లో ఘటన
  • ఉగ్రచర్యపై ఇప్పుడే చెప్పలేమంటున్న అధికారులు
  • కొనసాగుతున్న దర్యాప్తు

తమకు వచ్చిన పోస్టల్ కవర్‌ను విప్పిన 11 మంది అమెరికా మిలటరీ సిబ్బంది అనారోగ్యం పాలయ్యారు. అమెరికాలోని వాషింగ్టన్ మిలటరీ బేస్ వద్ద జరిగిందీ ఘటన. ఒక ఎన్వలప్ కవరు తమకు అందిందని, విప్పి చూడగా అందులో గుర్తు తెలియని పదార్థం ఉందని నావికాదళ అధికారి ఒకరు తెలిపారు. 11 మంది అస్వస్థతకు అదే కారణమని ఆయన వివరించారు.

వారిని ఆసుపత్రికి తరలించామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కవర్ విప్పి చూసిన వారు చేతులు, ముఖం కాలిన అనుభవానికి లోనయ్యారని ‘సీఎన్ఎన్’ పేర్కొంది. ఈ ఘటనను ఉగ్రచర్యగా చెప్పడం తొందరపాటు చర్యే అవుతుందని నావికాదళ అధికార ప్రతినిధి మేజర్ బ్రెయిన్ బ్లాక్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

America
military
envelope cover
  • Loading...

More Telugu News