Allu Arjun: ‘అల్లు’ వారి కుటుంబంలో పుట్టినరోజు వేడుక!

  • ‘అల్లు’ సోదరులలో ఒకరైన వెంకటేష్ కుమార్తె అన్విత బర్త్ డే వేడుక
  • పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అల్లు శిరీష్
  • ‘ఫేస్ బుక్’ వేదిక ఓ ఫొటో పోస్ట్ చేసిన యువనటుడు

తమ కుటుంబంలో జరిగిన పుట్టినరోజు వేడుక గురించి ప్రస్తావిస్తూ యువనటుడు అల్లు శిరీష్ ఓ పోస్ట్ చేశారు. ‘అల్లు’ సోదరులలో ఒకరైన అల్లు వెంకటేష్ కుమార్తె అన్విత బర్త్ డే వేడుక ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా కుటుంబసభ్యుల మధ్య అన్విత కేక్ కట్ చేసింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలో అల్లు అరవింద్, అల్లు అర్జున్ సోదరులు, తదితరులు ఉన్నారు. దీనిని పురస్కరించుకుని అన్వితకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘ఫేస్ బుక్’ వేదికగా అల్లు శిరీష్ తన శుభాకాంక్షలు తెలిపాడు. 

  • Loading...

More Telugu News