ramgopal varma: ‘సినీ దేవత అంతిమ మార్గం’ అంటూ వర్మ ట్వీట్

  • శ్రీదేవిని అమితంగా అభిమానించే వర్మ మరో ట్వీట్
  • ఆమె అంతిమయాత్ర ఫొటోను పోస్ట్ చేసిన దర్శకుడు
  • అంతిమయాత్ర వాహనానికి నలువైపులా అశేష జనవాహిని

సినీ నటి శ్రీదేవిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఉన్న అభిమానం..ఆరాధన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె మరణవార్త అనంతరం తన ఆవేదనను, బాధను నిరంతర ట్వీట్లతో వ్యక్తం చేసిన వర్మ, తాజాగా, మరో ట్వీట్ చేశారు.

‘సినీ దేవత అంతిమ మార్గం’ అంటూ తన పోస్ట్ లో పేర్కొన్న వర్మ, ముంబైలో శ్రీదేవి అంతిమయాత్రకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. శ్రీదేవి అంతిమయాత్ర వెళుతుండగా..ఆ వాహనానికి నలువైపులా అశేష జనవాహిని ఉండటం ఈ ఫొటోలో కనపడుతుంది. శ్రీదేవి అంతియమాత్రలో పలువురు సినీ నటులు, ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

కాగా, శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారి శ్రీదేవితో సీనియర్ ఎన్టీఆర్ ఉన్న ఓ ఫొటోను వర్మ పోస్ట్ చేశారు. నవ్వుతున్న ఎన్టీఆర్ పక్కన చిన్నారి శ్రీదేవి నిలబడి ఉండటం ఈ ఫొటోలో కనపడుతుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News