Chandrababu: కేసీఆర్ విషయంలో పొరపాటు జరిగింది.. కొన్ని తప్పులు సరిదిద్దుకోలేం: చంద్రబాబు

  • కేసీఆర్ కంటే విజయరామారావు గొప్ప నాయకుడేం కాదు
  • పీజేఆర్ పై గెలిచారని మంత్రి పదవి ఇచ్చాం
  • కొన్ని పరిణామాలు ఊహకు అందకుండా జరిగిపోతాయి

కొన్నిసార్లు కొన్ని కాలిక్యులేటెడ్ మిస్టేక్స్ చేస్తుంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొన్ని తప్పులను సరిదిద్దుకోలేమని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటినుంచి తనతో ఎంతో సన్నిహితంగా ఉండేవారని ఆయన అన్నారు. ఆయనకు వ్యతిరేకంగా కరణం రామచంద్రరావు ఉండేవారని... అయినప్పటికీ ఆ సమస్యను సరిచేశామని చెప్పారు.

ఇక కేసీఆర్ కంటే విజయరామారావు గొప్ప నాయకుడు కానప్పటికీ, పీజేఆర్ ను ఓడించారనే ఉద్దేశంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చామని తెలిపారు. కొన్ని పరిణామాలు ఊహకు కూడా అందకుండా జరిగిపోతాయని చెప్పారు. అయితే, ప్రతిదానికీ ఏదో అయిపోతుందనే భావనలో ఉంటే... ఏదీ చేయలేమని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పురస్కరించుకుని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈమేరకు స్పందించారు.

Chandrababu
KCR
vijayaramarao
  • Loading...

More Telugu News