cell phone: నీళ్లలో సెల్ ఫోన్ పడితే... ఏం చేయకూడదు... ఏం చేయాలి?

  • వెంటనే చార్జింగ్ కు కనెక్ట్ చేయకూడదు
  • స్విచాఫ్ చేసేయాలి
  • పొడి వస్త్రంతో మంచిగా తుడిచి, పేపర్లలో చుట్టేయాలి
  • ఆ తర్వాత ఎండలో ఆరనివ్వాలి

చేయి జారి సెల్ ఫోన్లు నీళ్లలో పడితే ఇక అవి పనిచేస్తాయో, లేదో తెలియదు. వేలాది రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. నీళ్లలో పడితే సెల్ ఫోన్ కు కంపెనీ వారంటీ ఉన్నా రూపాయి రాదు. ప్రమాద బీమా ఉంటే తప్ప నష్టపోక తప్పదు. ముఖ్యంగా హోలీ పండుగ సమయంలోనే ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ నీళ్లలో పడితే ఏం చేయకూడదో తెలుసుకుంటే మంచిది.

హెయిర్ డ్రయ్యర్ తో నీళ్లు లేకుండా చేద్దామనుకోవడం తప్పు. ఆ వేడికి సెల్ ఫోన్ లోని సున్నిత భాగాలు పాడవుతాయి. చార్జింగ్ సాకెట్ కు కనెక్ట్ చేసి చార్జ్ చేయకూడదు. నీటి కారణంగా షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే, ఫోన్ కు సంబంధించి ఎటువంటి బటన్ కూడా ప్రెస్ చేయవద్దు. దానివల్ల లోపలికి నీరు వెళ్లే ప్రమాదం ఉంటుంది.

వెంటనే స్విచాఫ్ చేసేయాలి. తడిసిన ఫోన్ ను వాడితే మరింత డ్యామేజ్ అవడమే కాకుండా పని చేయడమే ఆగిపోవచ్చు. ఫోన్ ను స్విచాఫ్ చేసిన తర్వాత శుభ్రమైన పొడి వస్త్రాన్ని తీసుకుని సెల్ ఫోన్ పై తడిని పూర్తిగా తుడిచేయాలి. పేపర్లలో చుట్టాలి. తేమ ఉంటే పూర్తిగా పోతుంది. సిమ్ కార్డు, మెమొరీ కార్డులున్నా తీసేయాలి. అప్పుడు ఫోన్ ను బాగా షేక్ చేయాలి. లోపల ఏవైనా నీటి చుక్కలు ఉంటే బయటకు వచ్చేస్తాయి. తర్వాత మొబైల్ ఫోన్ ను రైస్ బ్యాగులో ఒక రోజు ఉంచేయాలి. బియ్యంలో మునిగేట్టు పెట్టాలి. ఒకవేళ బ్యాక్ ప్యానెల్ తీసే వీలుంటే ఫోన్ ను సూర్యుడి వెలుగు కింద ఉంచినా సరిపోతుంది. ఆ తర్వాత సెల్ ఫోన్ ను ఆన్ చేసి చూసుకోవాలి.

  • Loading...

More Telugu News