sridevi: శ్రీదేవిపై నాకు ఎలాంటి ద్వేషం లేదు: అర్జున్ కపూర్

  • మా నాన్న జీవితంలోకి ఎవరు వచ్చినా గౌరవిస్తా
  • శ్రీదేవి అంటే గౌరవం ఉంది
  • శ్రీదేవి మరణం తర్వాత అర్జుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే

శ్రీదేవి అనుమానాస్పద మరణం తర్వాత బోనీకపూర్ కుటుంబానికి సంబంధించిన పలు వార్తలు వెలుగులోకి వచ్చాయి. బోనీకపూర్ మొదటి భార్య సంతానానికి, శ్రీదేవికి మధ్య మనస్పర్థలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. తొలి భార్య మోనా కుమారుడు అర్జున్ కపూర్ కు బోనీ దగ్గరవుతున్నాడని... ఈ విషయంలోనే శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి గురయ్యారనే వార్తలను విన్నాం.

మరోవైపు, గతంలో ఓ ఇంటర్వ్యూలో అర్జున్ కపూర్ మాట్లాడుతూ, శ్రీదేవిని కానీ, ఆమె కుమార్తెలను కానీ తాను కలిసే ప్రసక్తే లేదని చెప్పాడు. కానీ, శ్రీదేవి మరణం తర్వాత ఆమె మృతిపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెపై తనకు ఎలాంటి ద్వేషం లేదని తెలిపాడు. శ్రీదేవి అంటే తనకు ఎంతో గౌరవమని... తన తండ్రి జీవితంలోకి ఎవరు వచ్చినా గౌరవిస్తానని... అలాగే శ్రీదేవిని కూడా గౌరవిస్తానని చెప్పాడు.

sridevi
arjun kapoor
boney kapoor
  • Loading...

More Telugu News