sridevi: ముంబైలో ల్యాండ్ అయిన చిరంజీవి.. శ్రీదేవి చివరి చూపులకు ఐశ్వర్యరాయ్, సుస్మితాసేన్, రానా, మాధురి

  • ముంబై చేరుకున్న చిరంజీవి
  • విమానాశ్రయం నుంచి నేరుగా సెలెబ్రేషన్స్ క్లబ్ కు
  • చివరి చూపు చూసుకున్న రానా, ఐశ్వర్యారాయ్ తదితరులు

తాను ఎంతో అభిమానించే శ్రీదేవిని కడసారి చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి ముంబై వెళ్లారు. కాసేపటి క్రితం ఆయన ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా సెలెబ్రేషన్స్ క్లబ్ కు బయల్దేరారు. మరోవైపు, శ్రీదేవిని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్, రానాలు క్లబ్ కు చేరుకున్నారు. మధ్యాహ్నం శ్రీదేవి అంతిమయాత్ర జరగనుంది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు భారీ ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది.

sridevi
Chiranjeevi
susmitha sen
madhuri dixit
Ishwarya rai
rana
  • Loading...

More Telugu News