nagarjuna: నానికి సాయపడే రిటైర్డ్ డాన్ పాత్రలో నాగ్!

  • త్వరలో సెట్స్ పైకి నాగ్ .. నాని మల్టీ స్టారర్ 
  • కథానాయికలుగా శ్రద్ధా శ్రీనాథ్ .. మాళవిక నాయర్
  • వేసవిలో విడుదల చేయాలనే ఆలోచన

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా ఒక మల్టీస్టారర్ రూపొందనుంది. ఈ సినిమాలో నాగ్ సరసన కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ ను .. నాని జోడీగా మాళవిక నాయర్ ను ఎంపిక చేసుకున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమా మార్చి మొదటివారంలో రెగ్యులర్ షూటింగును మొదలు పెట్టుకుని ఏప్రిల్ చివరినాటికి ముగియనుంది.

మొత్తం 53 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున మాఫియా డాన్ గా కనిపించనుండగా .. డాక్టర్ పాత్రను నాని పోషించనున్నాడనే వార్త ఇంతకుముందే బయటికి వచ్చింది. అయితే ఈ సినిమాలో నాగ్ మాజీ డాన్ గా మాత్రమే కనిపిస్తాడట. కొన్ని కారణాల వలన ఆపదలో చిక్కుకున్న నానికి సాయం చేయడం కోసం నాగ్ మళ్లీ డాన్ గా రంగంలోకి దిగుతాడని అంటున్నారు. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.   

  • Loading...

More Telugu News