sridevi: శ్రీదేవిని కడసారి దర్శించుకున్న కమల్, వెంకటేష్, జయప్రద

  • కడసారి చూసేందుకు పోటెత్తుతున్న సెలబ్రిటీలు, అభిమానులు
  • క్లబ్ లోకి వెళ్లిన కమల్, వెంకటేష్, జయప్రద
  • వరుస కట్టిన ఖరీదైన కార్లు

ముంబైలోని సెలబ్రేషన్స్ క్లబ్ లో శ్రీదేవి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అతిలోకసుందరిని కడసారిన దర్శించుకునేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు క్లబ్ కు పోటెత్తుతున్నారు. విలక్షణ నటుడు కమలహాసన్, టాలీవుడ్ నటుడు వెంకటేష్, అలనాటి అందాల తార జయప్రద, అర్భాజ్ ఖాన్, హేమమాలిని, ఈషా డియోల్, సోనమ్ కపూర్ తదితరులు అక్కడకు చేరుకున్నారు. మరెందరో సెలబ్రిటీలు వచ్చి, వెళ్తున్నారు. క్లబ్ లోకి ఖరీదైన కార్లు వరుసగా వస్తున్నాయి. అభిమానుల క్యూలైన్ కిలోమీటర్ కు పైగా ఉంది.

sridevi
celebrity club
venkatesh
jayaprada
Kamal Haasan
  • Loading...

More Telugu News