jayendra saraswathi: జయేంద్ర సరస్వతి అసలు పేరు ఇదే.. కొన్ని వివరాలు!
- జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవ అయ్యర్
- 1935 జూలై 18న తంజావూరు జిల్లాలో జననం
- 1954 మార్చి 22న జయేంద్ర సరస్వతిగా మారారు
కంచికామకోఠి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఈ ఉదయం పరమపదించారు. గత కొంత కాలంగా శ్వాససంబంధ వ్యాధితో బాధ పడుతున్న ఆయన... ఈ ఉదయం కాంచీపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస వదిలారు. జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవ అయ్యర్. 1935 జూలై 18న తమిళనాడులోని తంజావూరు జిల్లా ఇరునీకల్ గ్రామంలో ఆయన జన్మించారు. 1954 మార్చి 22న ఆయన జయేంద్ర సరస్వతిగా మారారు. 1994 జనవరి 3 నుంచి కంచి పీఠాధిపతిగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగళ్ తర్వాత ఆయన బాధ్యతలను చేపట్టారు. జయేంద్ర సరస్వతి కంచి పీఠానికి 69వ పీఠాధిపతి.