jayendra saraswathi: పరమపదించిన కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి!

  • శివైక్యం చెందిన జయేంద్ర సరస్వతి
  • ఆయన వయసు 82 సంవత్సరాలు
  • ఆవేదనలో మునిగిపోయిన భక్తులు

కంచి కామకోఠి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మహా నిర్యాణం చెందారు. ఈ ఉదయం ఆయన శివైక్యం చెందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. కంచి కామకోటి పీఠానికి జయేంద్ర సరస్వతి 69వ పీఠాధిపతి. కాంచీపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన దేహాన్ని వీడారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం... ఈ ఉదయం ఆయనను స్థానికంగా ఉన్న ఏబీసీ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వైద్యులు తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం దక్కలేదు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఆయన నిర్యాణం చెందారన్న వార్తతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

jayendra saraswathi
Kanchipuram Kamakoti Math
dead
  • Loading...

More Telugu News