Road Accident: వీరా ట్రావెల్స్ బస్సు బోల్తా...15 మందికి గాయాలు

  • హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తున్న వీరా ట్రావెల్స్ బస్సు బోల్తా
  • 15 మంది ప్రయాణికులకు గాయాలు
  • ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు

ట్రావెల్స్ బస్సులు బోల్తాపడుతూ ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. గతవారం విశాఖపట్టణంలోని ఎన్ఏడీ కొత్తరోడ్డు జంక్షన్ లో లారీని ఢీ కొట్టి బస్సు బోల్తాపడి 50 మంది గాయపడిన ఘటన మరువకముందే ఇప్పుడు మరో సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్తున్న వీరా ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పొదొడ్డి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై అదుపు తప్పి డివైడర్‌ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆదిత్య అనే వ్యక్తి మృతిచెందగా 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గాయపడ్డవారిని హుటాహుటీన స్థానికులు ఆసుపత్రికి తరలించారని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

Road Accident
travels bus
15 injured
  • Loading...

More Telugu News