Inter: నేటి నుంచి ఏపీ, తెలంగాణల్లో ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

  • ఏపీలో 1423 , తెలంగాణలో 1294 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
  • ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం
  • రేపటి నుంచి ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఏపీలో 1423, తెలంగాణలో 1294 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు గంటముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఏపీలో నేటి పరీక్షకు సెట్ నంబరు 3 ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేయగా, తెలంగాణలో సెట్-బి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫస్టియర్ పరీక్షలు నేటి నుంచి మార్చి 17వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రేపటి నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. ఏపీలో ఈ ఏడాది విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘ఐపె సెంటర్ లొకేటర్’ అనే యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో విద్యార్థులు సులభంగా తెలుసుకోగలుగుతారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

Inter
Exams
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News