Pawan Kalyan: పవన్‌ది.. మాది ఒకటే ఆలోచన.. ఆయనతో కలిసి ముందుకు నడుస్తాం: సీపీఐ

  • వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి నడుస్తాం
  • త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తాం
  • చంద్రబాబును మోదీ పూచిక పుల్లలా చూస్తున్నారు

జనసేనతో జట్టు కట్టేందుకు సీపీఐ రెడీ అవుతోంది. తమ లాంటి ఆలోచనలే కలిగిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో కలిసి ముందుకు నడిచేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. మంగళగిరిలో జరుగుతున్న గుంటూరు జిల్లా సీపీఐ 24వ మహాసభల ప్రతినిధుల సభకు హాజరైన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా అజెండాతో ముందుకొచ్చే వారితోనే తమ పయనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

పవన్ కూడా తమ ఆలోచనా విధానంలోనే నడుస్తున్నారని, ఆయనతో కలిసి ముందుకువెళ్లాలని యోచిస్తున్నట్టు చెప్పారు. కడపలో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభల అనంతరం ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఎవరితో కలిసి ముందుకువెళ్లాలన్న విషయంలో ఇప్పటి వరకైతే స్పష్టత లేదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రధాని మోదీ పూచిక పుల్లలా చూస్తున్నారని విమర్శించారు.

Pawan Kalyan
Jana sena
CPI
Rama krishna
  • Loading...

More Telugu News