auto: రహదారిపై ప్రమాదం.. అక్కడే అతి వేగంతో గుండ్రంగా తిరిగిన ఆటో.. వీడియో వైరల్

  • సీసీ కెమెరాలో రికార్డు
  • ఆటోను అదుపుచేసిన పోలీసులు
  • చైనాలోని బోజ్‌హూ సిటీలో ఘటన

రద్దీగా ఉన్న నడిరోడ్డుపై ఓ ఎలక్ట్రానిక్‌ ఆటో రిక్షాను కారు ఢీ కొంది. అంతే, ఆ ఆటో రిక్షా అక్కడే ఓ సర్కిల్ పై తిరుగుతున్నట్లు గుండ్రంగా తిరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన తూర్పు చైనాలోని బోజ్‌హూ సిటీలో చోటు చేసుకుంది. ఆ ఆటో ఓ కూడలి వద్ద రోడ్డు క్రాస్ చేసి వెళుతోన్న సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా ఓ కారు దూసుకురావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

కారు బలంగా ఢీ కొట్టడంతో ఆటో డ్రైవర్ రోడ్డుపై పడి సృహ కోల్పోయాడు. ఆ ఆటో మాత్రం అలా అక్కడే చుట్టూ తిరిగింది. దీంతో అక్కడి వాహనదారులు కంగారు పడ్డారు. ఇద్దరు పోలీసులు సహా అక్కడ ఉన్నవారు ఆ ఆటోను ఎట్టకేలకు అదుపులోకి తెచ్చారు.  

  • Loading...

More Telugu News