Telangana: అవి రౌడీ సమన్వయ సమితులు!: డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు

  • రౌడీ సమన్వయ సమితులని ఏర్పాటు చేసి రైతు సమన్వయ సమితులు అంటారా?
  • ఎన్నికల కోసమే తాయిలాలు ప్రకటిస్తున్నారు
  • రూ.4 వేలు ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం అవివేకం
  • వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలవరు : అరుణ జోస్యం

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, రౌడీ సమన్వయ సమితులని ఏర్పాటు చేసి రైతు సమన్వయ సమితులు అంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోసమే తాయిలాలు ప్రకటిస్తున్నారని, రూ.4 వేలు ఇస్తే ఓట్లు వేస్తారనుకోవడం అవివేకమని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తలకిందులుగా తపస్సు చేసినా కేసీఆర్ గెలవరని ఆమె జోస్యం చెప్పారు.

Telangana
Congress
dk aruna
  • Loading...

More Telugu News