grocery: కిరాణా షాపులోకి వ‌చ్చి, తుపాకీతో బెదిరించి.. స‌రుకులు ఎత్తుకెళ్లిన యువ‌కులు.. దృశ్యాలు రికార్డు

  • ఊహించని పరిణామంతో షాకైన దుకాణదారులు
  • చివరకు దొంగలపై దాడి 
  • తప్పించుకు వెళ్లిన నిందితులు

కిరాణా షాపులోకి దూసుకొచ్చిన కొంద‌రు యువ‌కులు అక్క‌డున్న వారిని తుపాకీతో బెదిరించి, అనంత‌రం అక్క‌డ ఉన్న‌ స‌రుకులు ఎత్తుకెళ్లిన ఘ‌ట‌న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటు చేసుకుంది. ఊహించని ఈ పరిణామంతో ఆ స్టోర్‌లోని వారంతా షాకయ్యారు. వారిని తమకు దూరంగా ఉండాలని ఓ యువకుడు బెదిరిస్తుండగా, మరో యువకుడు సరుకులు తీసుకుని మరో వ్యక్తికి అందించాడు.

చివరకు వారు బయటకు వెళుతుండగా ఓ స్టోర్ యజమానితో పాటు కొందరు వారిపై దాడి చేయబోయారు. చివరకు ఆ యువకులు తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.   

  • Error fetching data: Network response was not ok

More Telugu News