Empowered Committee: కమల్ పార్టీ 'సాధికార కమిటీ' సభ్యుల జాబితా రిలీజ్
- కమిటీలో పదిహేను మందికి చోటు
- వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఎంపిక
- సోషల్ మీడియాలో జాబితా రిలీజ్
తమ పార్టీ సాధికార కమిటీ సభ్యుల జాబితాను 'మక్కళ్ నీది మయ్యమ్' అధ్యక్షుడు, తమిళ సినీ స్టార్ కమలహాసన్ ఈ రోజు ప్రకటించారు. ఈ జాబితాలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. కాగా, ఈ నెల 21న తమిళనాడులోని ఒత్తకడై మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కమల్ తన పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
జాబితా వివరాలు :
1. అరుణాచలం ఎ (వ్యవసాయ నిపుణులు/అడ్వొకేట్)
2. ఏజీ మౌర్య (విశ్రాంత ఐపీఎస్ అధికారి)
3. భారతి కృష్ణకుమార్ (రచయిత/దర్శకులు)
4. సి.రాజశేఖరన్ (అడ్వొకేట్)
5. సీకే కుమారవేల్ (వ్యాపారి)
6. కమీల నజీర్ (ఎంఎస్సి, ఎంఫిల్/చలనచిత్ర నిర్మాత/ఫ్యామిలీ కౌన్సెలర్)
7. జ్ఞానసంబంధన్ (ప్రొఫెసర్/రైటర్/స్పీకర్)
8. రాజ నారాయణన్ (రైటర్/జర్నలిస్ట్)
9. రంగరాజన్ (ఎక్స్ ఐఏఎస్)
10. ఆర్ఆర్ శివరామ్ (వ్యాపారి)
11. ఎస్.మూర్తి (ఆర్కేఎఫ్ఐ-సీనియర్ ఎగ్జిక్యూటివ్)
12. శౌరిరాజన్ (వ్యాపారి)
13. శ్రీ ప్రియ రాజ్‌కుమార్ (నటి/నిర్మాత/దర్శకురాలు)
14. సుక (రైటర్/డైరెక్టర్)
15. తంగవేలు (కమలహాసన్ సంక్షేమ సంఘం కార్యదర్శి)