budda arunareddy: నా మాటే నిజమైంది...అరుణను చూసి గర్విస్తున్నా: దీపాకర్మాకర్

  • అరుణను చూసి గర్వపడుతున్నాను
  • మేమిద్దరం రూమ్మేట్స్
  • ఎంత కష్టపడ్డా ఫలితం ఉండట్లేదని బాధపడేది

చివరకు తన మాటే నిజమైందని స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తెలిపింది. జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ ‌లో కాంస్య పతకం గెలిచి, ఆ ఘనత సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌ గా బుడ్డా అరుణారెడ్డి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో దీప మాట్లాడుతూ, అరుణను చూసి గర్వపడుతున్నానని తెలిపింది.

జాతీయ శిక్షణ శిబిరంలో తామిద్దరం ఒకే గదిలో ఉండేవాళ్లమని చెప్పింది. తాము చాలా సన్నిహితంగా ఉంటామని తెలిపింది. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండట్లేదని అరుణ అప్పుడప్పుడు నిరాశ చెందేదని దీప గుర్తు చేసుకుంది. నువ్విలాగే కష్టపడు, ఒకరోజు విజయం నీ సొంతవుతుందని తాను ధైర్యం చెప్పేదానినని, తన మాటే నిజమైందని దీపా కర్మాకర్ తెలిపింది. కామన్‌ వెల్త్‌ గేమ్స్ టోర్నీలో కూడా అరుణ స్వర్ణం గెలుస్తుందని తను బలంగా నమ్ముతున్నానని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. 

budda arunareddy
deepa karmakar
gymnastics
  • Loading...

More Telugu News