Saudi Arabia: రండి.. మహిళలు కూడా ఆర్మీలో చేరొచ్చు!: సౌదీ అరేబియా సంచలన ప్రకటన

  • గత జూన్ లో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ లు జారీ చేసిన రాజు
  • గత నెలలో ఫుట్ బాల్ మ్యాచ్ ల వీక్షణకు అనుమతి
  • తాజాగా మహిళలు ఆర్మీలో చేరొచ్చంటూ అనుమతి

గతకొంత కాలంగా మహిళా స్వేచ్ఛకు సంబంధించి సంస్కరణలు ప్రవేశపెడుతున్న సౌదీ అరేబియా, తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలు కూడా ఆర్మీలో చేరవచ్చంటూ ప్రకటించింది. రియాద్‌, మక్కా, అల్‌-ఖాసిం, మదీనా తదితర ప్రొవిన్స్ లలోని మహిళలు సైన్యంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఈ ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ మార్చి 1 (గురువారం) అని సౌదీఅరేబియా ప్రకటించింది. సౌదీఅరేబియాలో మహిళా సాధికారతను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆర్మీలో చేరాలనుకునే ఔత్సాహిక మహిళలు 12 విషయాలలో కనీస అర్హతలు కలిగి ఉండాలని సూచించారు. వాటిలో కొన్నింటి వివరాల్లోకి వెళ్తే...

1) సౌదీ జాతీయురాలై ఉండాలి.
2) 25-35 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి.
3) హైస్కూలు విద్య పూర్తి చేసి ఉండాలి.
4) వైద్య పరీక్షలు చేసుకోవడం తప్పనిసరి.
5) హైట్ 155 సెంటీమీటర్లకు తగ్గకూడదు.
6) గార్డియన్‌ అనుమతితోనే సైన్యంలో చేరాలి.. వంటి నిబంధనలున్నాయి.

కాగా, గార్డియన్ అనుమతి తప్పనిసరి అన్న నిబంధనపై మానవహక్కుల సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఇదిలా ఉంచితే, గత జూన్ లో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసిన రాజు, గత నెలలో మహిళలు కూడా ఫుట్ బాల్ మ్యాచ్ లు చూడొచ్చంటూ అనుమతినిచ్చారు. తాజాగా ఆర్మీలో కూడా చేరొచ్చంటూ ప్రకటించారు. 

Saudi Arabia
first time opened applications for women
Saudi Arabia allows women to join military
  • Loading...

More Telugu News