Sridevi: నేడు బోనీకపూర్ ను అరెస్టు చేసే అవకాశం?
- నిన్న మూడు గంటల పాటు బోనీ కపూర్ ను విచారించిన దుబాయ్ పోలీసులు
- నేడు మరోసారి విచారించనున్న పోలీస్ అధికారులు
- పాస్ పోర్టు స్వాధీనం, దేశం వీడొద్దని ఆంక్షలు
ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు రేగుతున్న నేపథ్యంలో దుబాయ్ పోలీసులు వాటన్నింటికీ సమాధానాలు వెతుకుతున్నారు. పెళ్లి ఈ నెల 20న జరిగితే శ్రీదేవి 24 వరకు దుబాయ్ లోనే ఎందుకుండాల్సి వచ్చింది? వివాహానంతరం ముంబైకి వచ్చిన బోనీకపూర్ మళ్లీ దుబాయ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? బాత్ టబ్ లో అచేతనంగా పడి ఉన్న ఆమెను చూసిందెవరు? నీటిలో మునిగి మృతి చెందిందని చెప్పాల్సిన దుబాయ్ ఫోరెన్సిక్ నిపుణులు... 'ప్రమాదవశాత్తూ..' అని ఎలా, ఎందుకు చెప్పారు? అన్న ప్రశ్నలకు సమాధానాల కోసం పునర్విచారణ మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో నిన్న మూడు గంటలపాటు విచారించిన బోనీకపూర్ ను నేడు మరోసారి విచారించనున్నారు. ఇప్పటికే ఆయన పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్షలు విధించారు. నేడు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీదేవి, బోనీకపూర్ కాల్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శ్రీదేవి ఫోన్ నుంచి ఒకరికి ఎక్కువ కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు. వాటి వివరాలు ఆరాతీయనున్నారు.