Rajinikanth: సీన్ పెర్ఫెక్షన్ కోసం రజనీ ముఖంపై నిజంగానే ఉమ్మేసిన శ్రీదేవి!

  • 16 వయదినలే సినిమాలో ఘటన
  • స్వయంగా ఉమ్మి వేయమన్న రజనీకాంత్
  • శ్రీదేవి నటనకు అభిమానుల బ్రహ్మరథం

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో శ్రీదేవి ‘16 వయదినలే’ అనే సినిమాలో నటించింది. దక్షిణాదిలో పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆమెకు ఈ సినిమా కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాలో శ్రీదేవి నటనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర ఆంశం ఇప్పుడు బయటకు వచ్చింది.

హీరో రజనీకాంత్ ముఖంపై శ్రీదేవి ఉమ్మివేయాల్సిన సీన్ అది. ఆ సీన్ చేయడానికి శ్రీదేవి తొలుత నిరాకరించిందట. అయితే దర్శకుడితోపాటు రజనీకాంత్ కూడా ఒప్పించడంతో శ్రీదేవి అంగీకరించినప్పటికీ సీన్ పెర్‌ఫెక్ట్‌గా రాలేదట. ఎన్ని టేకులు తీసుకున్నా సీన్ సరిగ్గా రాకపోవడంతో స్పందించిన రజనీ.. శ్రీదేవి దగ్గరికి వెళ్లి ‘మీరు నా ముఖంపై నిజంగా ఉమ్మేయండి.. ఏం పర్లేదు. అప్పుడైతే సీన్ పర్ఫెక్ట్‌గా వస్తుంది’ అని చెప్పాడట. ఇక సినిమా విడుదలయ్యాక చాలామంది ఈ సినిమాను తొలుత ప్లాప్ అన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సూపర్ డూపర్ హిట్ అయింది.

Rajinikanth
Sridevi
Tamil
Movie
  • Loading...

More Telugu News