Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. యువతిని ప్రేమలోకి దింపి, కిడ్నాప్‌.. వాట్సప్‌లో వీడియో పంపిన యువకుడు

  • రూ.లక్ష ఇవ్వాలని ఆమె తల్లిదండ్రులకు వీడియో పంపిన యువకుడు
  • పోలీసులకు ఫిర్యాదు
  • మొబైల్ లొకేషన్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతితో స్నేహం పెంచుకుని ప్రేమలోకి దింపిన ఓ యువకుడు చివరకు ఆమెను కిడ్నాప్ చేశాడు. నిన్న సాయంత్రం ఆ యువతి ఫోన్ నుంచి ఆమె తల్లికి వాట్సప్‌లో ఓ వీడియో వచ్చింది. అందులో సదరు యువకుడు ఆ అమ్మాయిని చూపిస్తూ రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

ఆ వీడియోను చూసిన పోలీసులు.. మొబైల్ లొకేషన్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటన నగరంలోని చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో జరిగింది. తమ కూతురు రెండు రోజుల నుంచి కనపడడం లేదని, మొన్న రాత్రే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, నిన్న తమకు వాట్సప్ మెసేజ్ వచ్చిందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.

  • Loading...

More Telugu News