morney morkel: రిటైర్ అవుతున్నట్టు ప్రకటించిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్

  • ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రిటైర్ అవుతా
  • అంతర్జాతీయ షెడ్యూల్ తో ఒత్తిడి పెరుగుతోంది
  • కుటుంబంతో సరైన సమయం గడపలేకపోతున్నా

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకుంటానని తెలిపాడు. 33 ఏళ్ల మోర్కెల్ ఇప్పటివరకు 83 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ-20లు ఆడాడు.

సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఇది సరైన సమయమని ఈ సందర్భంగా మోర్కెల్ అన్నాడు. అంతర్జాతీయ షెడ్యూల్ వల్ల తనపై ఒత్తిడి పెరుగుతోందని... కుటుంబంతో కూడా సరైన సమయం గడపలేకపోతున్నానని తెలిపాడు. దక్షిణాఫ్రికాకు ఆడిన ప్రతి క్షణాన్ని తాను ఎంతగానో ఎంజాయ్ చేశానని చెప్పాడు. తనలో మిగిలి ఉన్న శక్తిని ఆస్ట్రేలియా సిరీస్ లో ఉపయోగిస్తానని... జట్టుకు విజయాన్ని కట్టబెట్టాలని అనుకుంటున్నానని తెలిపాడు.

morney morkel
retirement
south africa
  • Loading...

More Telugu News