Pawan Kalyan: అందుకే, పవన్ కల్యాణ్ తో కలిసి చంద్రబాబు నాటకాటలాడుతున్నారు: శిల్పా చక్రపాణిరెడ్డి

  • ప్రత్యేక హోదాపై చంద్రబాబుది పూటకో మాట 
  • రాజకీయాలంటే సినిమాలు తీసినంత తేలిక కాదు
  • మిడిమిడి జ్ఞానంతో పవన్ మాట్లాడుతున్నారు 

ఏపీకి ప్రత్యేక హోదాపై జగన్ కు క్రెడిట్ దక్కకూడదని చెప్పి పవన్ కల్యాణ్ తో కలిసి చంద్రబాబు నాటకాలాడుతున్నారని వైసీపీ నేత చక్రపాణిరెడ్డి విమర్శించారు. కర్నూలులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదా సాధించడం కోసం అనేక కార్యక్రమాలు చేసిన ఘనత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబునాయుడు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై చక్రపాణిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే సినిమాలు తీసినంత తేలిక కాదని, మిడిమిడి జ్ఞానంతో పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఏపీకి జరిగిన అన్యాయంపై నిరసనలో భాగంగా మార్చి 1న తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు.

Pawan Kalyan
silpa chakra pani reddy
  • Loading...

More Telugu News