Viral Videos: 'మాటలు సరిగ్గా రానీయ్‌' లైవ్‌లో న్యూస్‌ చదువుతూ గొడవపడ్డ ఇద్దరు పాక్ యాంకర్లు.. వీడియో వైరల్

  • డైలీ పాకిస్థాన్ న్యూస్ ఛానెల్‌లో ఘటన
  • గొడవపడ్డ మేల్, ఫిమేల్ యాంకర్‌
  • ఫిమేల్ యాంకర్‌పై మేల్ యాంకర్‌ ఫిర్యాదు

టీవీల్లో కోట్లాది మంది చూసే వార్త‌లు చ‌దువుతున్న‌ప్పుడు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాలి. అనుకోకుండా చిన్న పొర‌పాటు జరిగినా త‌మ సంస్థ‌కి చెడ్డ పేరు వ‌స్తుంద‌ని ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. అటువంటిది ఇద్ద‌రు యాంక‌ర్లు న్యూస్ చ‌దివే స‌మ‌యంలోనే గొడ‌వ‌ప‌డ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వార్తలు చదువుతోన్న సమయంలో మధ్యలో చిన్న బ్రేక్ తీసుకున్నప్పుడు మేల్ యాంకర్‌.. ఫిమేల్ యాంకర్‌పై గరం గరం అయ్యాడు.

అయితే, బ్రేక్ పూర్తయినప్పటికీ కొన్ని సెకన్ల పాటు వారి మధ్య జరిగిన సంభాషణ లైవ్ న్యూస్ లో వచ్చేసింది. మొత్తం 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో నవ్వు పుట్టిస్తోంది. 'ఇటువంటి యాంకర్‌తో నేను ఎలా బులిటెన్‌ను కొనసాగించాలి?' అని మేల్ యాంకర్ అనగా, 'మాటలు సరిగ్గా రానీయ్' అని ఫిమేల్ యాంకర్ కస్సుమంది. డైలీ పాకిస్థాన్ అనే న్యూస్ ఛానెల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు న్యూస్ ఛానెల్‌కు సంబంధించిన ఒకరు ఈ వీడియోను సోషల్ మీడియాలో ఉంచారు. 'క్యూట్‌ పాకిస్థాన్‌ యాంకర్స్‌' అంటూ వీరికి నెటిజన్లు పేరు పెట్టారు.   

Viral Videos
news
anchors
Pakistan
  • Error fetching data: Network response was not ok

More Telugu News