sri devi: శ్రీదేవి అన్న మాటలు ఇంకా నా చెవుల్లో మార్మోగుతున్నాయి: పాక్ నటుడు అద్నాన్ సిద్దిఖీ

  • మోహిత్ వివాహానికి తప్పనిసరిగా రావాలని బోనీ ఆహ్వానించారు
  •  ఆ వివాహానికి ఆలస్యంగా వెళ్లాను
  • ‘చాలా ఆలస్యంగా వచ్చారు’ అన్న శ్రీదేవి మాటలు మర్చిపోలేకపోతున్నా  

దుబాయ్ లో ఇటీవల జరిగిన బోనీ కపూర్ మేనల్లుడు మోహిత్ వివాహానికి తాను కూడా హాజరయ్యానని ‘మామ్’లో నటించిన పాకిస్థాన్ నటుడు అద్నాన్ సిద్ధిఖీ అన్నాడు. ఈ పెళ్లికి తనను కచ్చితంగా రావాలని బోనీ కపూర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించాడు. ‘మామ్’ తర్వాత తనను శ్రీదేవి చూడలేదని, తన కోసం ఎదురుచూస్తున్నట్టు ఆయన తనతో చెప్పారని అన్నాడు.

పెళ్లి రోజున తాను ఎక్కిన విమానం ఆ రోజు రాత్రి పన్నెండు గంటలకు చేరడంతో ఆలస్యంగా వివాహానికి హాజరయ్యానని అన్నాడు. ‘చాలా ఆలస్యంగా వచ్చారు’ అని శ్రీదేవి అన్న మాటలు ఇంకా తన చెవుల్లో మార్మోగుతున్నాయని ఆవేదన చెందాడు. అక్కడికి వెళ్లిన తనను శ్రీదేవి తన కుటుంబసభ్యులకు పరిచయం చేశారని గుర్తుచేసుకున్నాడు. 

sri devi
dubai
adnan siddhiqui
  • Loading...

More Telugu News