mumbai: ముంబయిలోని అనిల్ కపూర్ నివాసానికి చేరుకున్న టాలీవుడ్‌ నటుడు వెంకటేశ్!

  • అల్‌ఖుసేనీ పోలీసు శవాగారంలోనే ఇంకా శ్రీదేవి భౌతికకాయం 
  • ఇమిగ్రేషన్‌, ఇతర లాంఛనాలకు 3-4 గంటల సమయం పట్టే అవకాశం
  • అనిల్ కపూర్ నివాసానికి వెళ్లి సంతాపం తెలిపిన టబు, కరన్ జోహార్, మనీష్ మల్హోత్రా

దుబాయ్‌లో మృతి చెందిన సినీనటి శ్రీదేవి భౌతిక కాయం ప్రస్తుతం అక్కడి అల్‌ఖుసేనీ పోలీసు శవాగారంలోనే ఉంది. భౌతికకాయం అప్పగించాక ఇమిగ్రేషన్‌, ఇతర లాంఛనాలకు 3-4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఆమె భౌతిక కాయం ఈ రోజు అర్ధరాత్రి భారత్ చేరుకునే అవకాశం ఉంది. కాగా, ముంబయిలోని శ్రీదేవి ఇంటికి పలువురు సినీ ప్రముఖులు చేరుకుంటున్నారు. వెంకటేశ్‌, టబు, ఫరా ఖాన్, ఫర్హాన్ అఖ్తర్, కరన్ జోహార్, మనీష్ మల్హోత్రా, మాధురి దీక్షిత్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు అనిల్ కపూర్ నివాసానికి వెళ్లి సంతాపం తెలిపారు.  

mumbai
venkatesh
Sridevi
Karan Johar
  • Error fetching data: Network response was not ok

More Telugu News