Telugudesam: భూ కబ్జా ఆరోపణల కేసులో బోండా ఉమ భార్యకు నోటీసులు

  • భూ కబ్జా ఆరోపణల కేసుపై అధికారుల విచారణ
  • భార్య సుజాతకు, ఉమ అనుచరుడుకు ఆర్డీవో నోటీసులు
  • సబ్ కలెక్టర్ కార్యాలయానికి  హాజరు కావాలని ఆదేశాలు

భూ కబ్జా ఆరోపణల కేసులో విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు భార్య సుజాతకు అధికారులు నోటీసులు జారీ చేశారు. బాధితుడు కేసిరెడ్డి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. ఈ మేరకు సుజాతకు, ఉమ అనుచరుడు మాగంటి బాబుకు ఆర్డీవో నోటీసులు జారీ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఈరోజు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

కాగా, 1951లో సూర్యనారాయణ అనే స్వాతంత్ర్య సమరయోధుడికి ప్రభుత్వం పది ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 2016లో నకిలీ పత్రాలు సృష్టించి బోండా ఉమ ఆ స్థలంలో కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సూర్యనారాయణ మనవడు సురేష్ గత ఏడాది ఫిబ్రవరి 10న విజయవాడలోని సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో సీఐడీ అధికారులను అతను ఆశ్రయించారు.

సీఐడీ అధికారుల విచారణలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఇదిలా ఉండగా, తనపై నమోదైన కేసులు కొట్టి వేయాలంటూ సుజాత హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు ఎనిమిది వారాల స్టే విధించింది. ఈలోగా, కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News