keerthi suresh: అభినయ శ్రీదేవికి 'మహానటి' సినిమా అంకితం

  • ముగింపు దశలో 'మహానటి'
  • త్వరలో పాటల చిత్రీకరణ 
  • అశ్వనీదత్ తాజా నిర్ణయం

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో శ్రీదేవికి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నవరసాలతో దాసోహం అనిపించుకున్న ఈ కథానాయికకు అశేషమైన సంఖ్యలో అభిమానులు వున్నారు. వాళ్లందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ ఆమె అనంతలోకాలకు తరలివెళ్లింది. ఆమె జ్ఞాపకాలను తలచుకుంటూ సన్నిహితులంతా ఆవేదన చెందుతున్నారు.

 శ్రీదేవితో 'ఆఖరిపోరాటం' .. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' వంటి సూపర్ హిట్లు తీసిన అశ్వనీదత్, ఆమెతో తనకి గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన బ్యానర్ పై రూపొందుతోన్న 'మహానటి' సినిమాను శ్రీదేవికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. త్వరలోనే పాటలను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.      

keerthi suresh
samanta
  • Loading...

More Telugu News