kajal: ప్రేమా లేదు .. డేటింగూ లేదు .. కొట్టిపారేసిన కాజల్

  • తెలుగు .. తమిళ భాషల్లో బిజీగా కాజల్ 
  • ప్రేమలో పడిందంటూ ముంబై లో టాక్ 
  • అదేం లేదంటున్న కాజల్

తెలుగు .. తమిళ భాషల్లో అందాల కథానాయికగా కాజల్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అగ్రకథానాయకులతో మాత్రమే వరుస సినిమాలు చేస్తూ వస్తోన్న కాజల్... ఈ మధ్య కుర్ర హీరోలతోనూ నటించడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉండటం విశేషం.

ఈ నేపథ్యంలోనే ఆమె ముంబైకి చెందిన ఒక పారిశ్రామికవేత్తతో ప్రేమలో పడిందనే టాక్ వినిపిస్తోంది. ఆయనతో డేటింగ్ చేస్తున్నట్టుగా ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఈ వార్త కాజల్ వరకూ చేరడంతో ఆమె స్పందించింది. తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదనీ .. డేటింగూ చేయడం లేదని స్పష్టం చేసింది. ఈ వార్తలో ఎంత మాత్రం నిజం లేదనీ .. కేవలం పుకారు మాత్రమేనని తేల్చి చెప్పింది. కెరియర్ పైనే తాను పూర్తి దృష్టి పెట్టాననీ, మరిన్ని మంచి పాత్రలు చేయాలనేదే తన ఆశయమంటూ చెప్పుకొచ్చింది.      
 
 

  • Loading...

More Telugu News