chandra sekhar yeleti: అఖిల్ మూవీ చేయాలనుకున్న చంద్రశేఖర్ యేలేటి .. చేజారిన ఛాన్స్

  • అఖిల్ పై దృష్టి పెట్టిన చంద్రశేఖర్ యేలేటి 
  • వెంకీ అట్లూరి పట్ల అఖిల్ ఆసక్తి
  • ఆలోచనలోపడిన యేలేటి

మంచి అభిరుచి కలిగిన దర్శకులలో చంద్రశేఖర్ యేలేటి పేరు కనిపిస్తుంది. 'ఐతే' .. 'అనుకోకుండా ఒకరోజు' .. 'మనమంతా' వంటి సినిమాలు ఆయన అభిరుచికి అద్దం పడుతుంటాయి. అలాంటి చంద్రశేఖర్ యేలేటి ఈ మధ్యకాలంలో సరైన హిట్ ను ఇవ్వలేకపోయాడు. అయినా ఆయనతో ఒక సినిమా చేయడానికి మైత్రీ మూవీస్ వారు ముందుకు వచ్చారు.

సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమా చేసిపెట్టమని వాళ్లు అడిగారట. అయితే అఖిల్ తో చేయడానికే చంద్రశేఖర్ యేలేటి ఆసక్తిని చూపించి, ఆ దిశగానే గట్టి ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే అఖిల్ మాత్రం 'తొలిప్రేమ'తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరితో సినిమా చేయడానికే ఉత్సాహాన్ని చూపుతున్నాడట. ఈ లోగా సాయిధరమ్ తేజ్ .. కిషోర్ తిరుమలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దాంతో ఇటు యేలేటికి ఈ ఛాన్స్ కూడా పోయింది. ఇప్పుడాయన ఏం చేస్తాడో చూడాలి మరి.     

chandra sekhar yeleti
akhil
  • Loading...

More Telugu News