giriraj singh: భారతీయులందరి పూర్వజుడు రాముడే!: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

  • భారతీయులందరి పూర్వజుడు రాముడే
  • భారత్ లో బాబర్ వారసులు లేరు
  • అసదుద్దీన్ ఒవైసీని జిన్నా భూతం ప్రభావితం చేస్తోంది

భారతీయ ముస్లింలంతా రాముడి వారసులేనని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. బాబ్రీ మసీదుని నిర్మించి తీరుతామన్న ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, అసదుద్దీన్ ఒవైసీని జిన్నా భూతం పట్టుకుని ప్రభావితం చేస్తోందని విమర్శించారు. అందుకే దేశాన్ని ముక్కలు చేయాలనే ధోరణితో అలా మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

భారతదేశంలో బాబర్ వారసులెవరూ లేరని, భారతీయ ముస్లింలలో విదేశీయులెవరూ లేరని, భారతీయ ముస్లింలంతా రాముడివారసులేనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. హిందూ, ముస్లిం పూజల్లో తేడాలు ఉన్నప్పటికీ, గతంలో తామంతా ఒకటేనని, భారతీయులందరి పూర్వజుడు రాముడేనని ఆయన చెప్పారు. 

giriraj singh
Asaduddin Owaisi
comments
  • Loading...

More Telugu News