Reliance: శ్రీదేవి భౌతికకాయాన్ని తీసుకురావడానికి దుబాయ్ వెళ్లిన అంబానీ విమానం

  • దుబాయ్ లో గుండె పోటుతో మృతిచెందిన శ్రీదేవి
  • భౌతికకాయాన్ని తీసుకురావడానికి విమానాన్ని పంపించిన ముఖేశ్ అంబానీ
  • అంత్యక్రియలకు ముంబైలో ఏర్పాట్లు 

మేనల్లుడి వివాహ వేడుకకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి హోటల్ గదిలో గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆమె భౌతిక కాయాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ ముందుకు వచ్చారు. రిలయన్స్ సంస్థకు చెందిన 13 సీట్ల ప్రైవేటు జెట్‌ విమానాన్ని దుబాయ్‌ కి పంపించారు.

నిన్న మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ విమానం ముంబై నుంచి దుబాయ్‌ కు వెళ్లింది. శవపరీక్షలో ఆలస్యం కారణంగా శ్రీదేవి మృతదేహం స్వదేశం చేరలేదు. శ్రీదేవి పార్థివ దేహంతో పాటు కుటుంబ సభ్యులు, సమీప బంధువులు ఈ విమానంలో ముంబై చేరనున్నారు. నేడు ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

Reliance
mukesh ambani
13 seat jet flight
Sridevi
  • Loading...

More Telugu News