father: కొడుకుని ఎందుకు పుట్టించలేదని దేవుడిపై ఆగ్రహం.. గుడిలోకి వెళ్లి విగ్రహాలను ధ్వంసం చేసిన వైనం

  • తమిళనాడులోని గోవిందరెడ్డిపాళయంలో ఘటన
  • కొడుకు పుట్టాలని దేవుళ్లకి మొక్కుకున్న తండ్రి
  • రెండో సంతానంగా మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో ఆవేశం

ఈ కాలంలోనూ ఆడపిల్ల పుట్టిందంటే దురదృష్టంగా భావిస్తున్నారు కొందరు తండ్రులు. ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ రాణిస్తూ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్న సంఘటనలు ఎన్నో కనపడుతున్నా తమకు పిల్లాడే కావాలని కొందరు కోరుకుంటున్నారు. అటువంటి ఘటనే తమిళనాడులోని గోవిందరెడ్డిపాళయంలో జరిగింది.

ఉలగనాథన్ అనే వ్యక్తి తనకు కొడుకు పుట్టాలని దేవుళ్లకి మొక్కుకున్నాడు. చివరకు తనకు రెండో సంతానంగా మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో తాను మొక్కిన దేవుళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొడుకుని ఎందుకు పుట్టించలేదని ఆగ్రహంగా తమ గ్రామంలోని మునీశ్వరన్‌ ఆలయంలోకి వెళ్లి దేవుళ్ల విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు గుడి వద్దకు చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

father
son
daughter
god
Tamilnadu
  • Loading...

More Telugu News