Mohanbabu: శ్రీదేవి మరణంపై మోహన్ బాబు ఏమన్నారంటే...!

  • శ్రీదేవి కుటుంబంతో మంచి అనుబంధముంది
  • ఆమె తల్లి తిరుపతికి చెందినవారు
  • భారతీయ చిత్రసీమ మంచి నటిని కోల్పోయింది

నటి శ్రీదేవి మరణంపై విలక్షణ నటుడు, నిర్మాత డాక్టర్ మోహన్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీదేవి కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి ఆయన వివరించారు. శ్రీదేవి తల్లి తిరుపతికి చెందిన వారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. శ్రీదేవితో కలిసి చాలా సినిమాల్లో నటించానని, భారతీయ చిత్రసీమ మంచి నటిని మాత్రమే కాదు....ఓ ఉన్నతమైన వ్యక్తిని కూడా కోల్పోయిందని ఆయన బాధను వ్యక్తం చేశారు.

తన 42వ సినీ జీవిత ఉత్సవాలు విశాఖపట్నంలో జరుగుతున్నప్పుడు కేవలం ఫోన్ చేయగానే ఆమె వచ్చి ఆ వేడుకల్లో పాల్గొన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆమె కుటుంబానికి మనోనిబ్బరాన్ని శిరిడీ సాయినాథుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. 

Mohanbabu
Krshna
Krishnam raju
Rana
Kajal
  • Loading...

More Telugu News