Charmee: ఛార్మి ఫ్యామిలీ ఫొటోల్లో శ్రీదేవి... వీడియో చూడండి

  • శ్రీదేవి మరణాన్ని నమ్మలేకపోతున్నా
  • ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా
  • శోకసంద్రంలో సినీ పరిశ్రమలు

ప్రముఖ నటి శ్రీదేవి (54) మృతికి పంజాబీ భామ ఛార్మి సంతాపం వ్యక్తం చేసింది. అతిలోకసుందరి కుటుంబానికి ఆమె ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. తమ ఇంట్లోని ఫ్యామిలీ ఫొటోల్లో శ్రీదేవి మాత్రమే ఉందంటూ చార్మి సోషల్ మీడియాలో సంబంధిత వీడియోను పోస్టు చేసింది. శ్రీదేవి మరణవార్త విని తన నోట మాటలు రావడం లేదని ఆమె చెప్పింది. ఆమె మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంది. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

 మరోవైపు ప్రముఖ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శృతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌లు కూడా శ్రీదేవి మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ హీరోలు ఎన్‌టీఆర్, రవితేజ, నాగశౌర్య, సుధీర్ బాబు, కమెడియన్ వెన్నెల కిశోర్, హీరోయిన్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

కాగా, దుబాయిలో ఓ వివాహానికి హాజరైన శ్రీదేవి శనివారం రాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. సినిమాల పరంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అతిలోకసుందరి అందర్నీ విడిచిపెట్టి వెళ్లిపోవడంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

Charmee
Kajal
Sridevi
Raviteja
Sudheer babu
  • Error fetching data: Network response was not ok

More Telugu News