Sridevi: శ్రీదేవి మరణించారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: రవితేజ

  • ఆమె మరణం సినీ పరిశ్రమకు భారీ లోటు
  • ఆమె స్థానం ఎవరూ భర్తీ చేయలేరు
  • శోకసంద్రంలో సినీ పరిశ్రమలు

అతిలోకసుందరి శ్రీదేవి (55) మరణంపై ప్రముఖ హీరో రవితేజ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె మరణం తప్పకుండా చిత్ర పరిశ్రమకు భారీ లోటని మాస్ మహారాజ్ అన్నారు. ఆమె మరణించిందన్న వార్తను తానిప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆయన అన్నారు. ఆమె లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరని ఆయన చెప్పారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రవితేజతో పాటు యువ హీరోలు సుధీర్ బాబు, నాగశౌర్య, కమెడియన్ వెన్నెల కిశోర్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తదితరులు కూడా శ్రీదేవి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

దుబాయిలో ఓ వివాహానికి హాజరైన శ్రీదేవి శనివారం రాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. 'మా నాన్న నిర్దోషి' చిత్రంతో నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీదేవి తన కెరీర్‌లో అన్ని భాషల్లోనూ కలిపి మొత్తం 260 సినిమాలు చేశారు. చివరగా హిందీలో 'మామ్' చిత్రం చేశారు. తెలుగులో విక్టరీ వెంకటేశ్‌తో చేసిన 'క్షణక్షణం' చిత్రానికి గాను ఆమెకు నంది అవార్డు లభించింది. ఇంకా 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులూ ఆమె తన ఖాతాలో వేసుకున్నారు. 2013లో ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు. అలాంటి అపురూప నటి ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోవడంపై సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News