Boat: ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న పడవ మునక.. ప్రయాణికులు సేఫ్

  • ముంబైలోని మధ్ ఐలండ్‌లో ఘటన
  • దర్గాను దర్శించుకుని వస్తుండగా మునిగిన పడవ
  • తీరానికి సమీపంలో జరగడంతో తప్పిన పెను ప్రమాదం

ఎమ్మెల్యే, పోలీసు అధికారి సహా 15 మంది ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. ప్రమాదం నుంచి అందరూ బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముంబైలో జరిగిందీ ఘటన. మధ్ ఐలండ్‌లోని దర్గా నుంచి స్థానిక ఎమ్మెల్యే అస్లాం షేక్, పోలీసు అధికారి, ఇతర భక్తులతో బయలుదేరిన పడవ కొద్ది దూరం రాగానే మునిగిపోయినట్టు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ప్రకృతి విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి అందరూ క్షేమంగా బయటపడ్డారని, ఎవరికీ ఎటువంటి గాయాలు జరగలేదని తెలిపారు. తీరానికి దగ్గరగా ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పినట్టు పేర్కొన్నారు.

Boat
Mumbai
Aslam Shaikh
capsize
  • Loading...

More Telugu News