ram gopal varma: శ్రీదేవి మరణంపై తీవ్ర ఆవేదనకు గురైన వర్మ.. దేవుడిపై ఆగ్రహం!

  • శ్రీదేవి మరణం పట్ల కలత చెందిన వర్మ
  • కాంతి కన్నా ప్రకాశవంతమైనది దూరమైందంటూ ఆవేదన
  • బోనీ కపూర్ గురించి ఆలోచిస్తేనే ఆవేదనగా ఉందన్న వర్మ

అతిలోక సుందరిగా కోట్లాదిమంది హృదయాలలో చోటు సంపాదించుకున్న ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణంతో అందరూ షాక్ కు గురయ్యారు. ఎంతో ఆరోగ్యంగా కనిపించే శ్రీదేవి గుండెపోటుతో మరణించిందన్న వార్త... అందరినీ కలచివేస్తోంది. ముఖ్యంగా ఆమెను అన్నింటికన్నా ఎక్కువగా అభిమానించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆమె మరణం పట్ల తీవ్ర కలత చెందారు.

ఆ భగవంతుడిని తాను ఎన్నడూ ద్వేషించనంతగా ఈరోజు ద్వేషిస్తున్నానని అన్నారు. కాంతికన్నా ఎక్కువ ప్రకాశవంతమైనది నేడు మనకు దూరమైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లోకం విడిచిపోయిన శ్రీదేవి అంటే తనకు చాలా కోపమని చెప్పారు. శ్రీదేవి ఏ లోకంలో ఉన్నా... ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని తెలిపారు. ఆమె భర్త బోనీ కపూర్ గురించి ఆలోచిస్తేనే చాలా ఆవేదనగా ఉందని అన్నారు. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. 

ram gopal varma
sridevi
boni kapoor
death
  • Loading...

More Telugu News