Kadapa District: అర్ధరాత్రి తండ్రిని వాహనంలో తీసుకొచ్చి రోడ్డు పక్కన వదిలి వెళ్లిపోయిన పుత్రరత్నాలు

  • కడప జిల్లా రాయచోటి తాలూకా గాలివీడులో అమానవీయ ఘటన
  • భార్యల మాట విని తండ్రిని వదిలించుకున్న కుమారులు
  • చివరకు ఆశ్రమంలో చేరిన తండ్రి

కడప జిల్లా రాయచోటి తాలూకా గాలివీడులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తమను అల్లారుముద్దుగా పెంచి, పెద్ద చేసి 10 ఎకరాల పొలం ఇచ్చిన తండ్రిని ఐదుగురు కుమారులు వద్దనుకున్నారు. ఇక ఆయనతో తమకు పని లేదని అర్ధరాత్రి వేళ వాహనంలో ఆయనను తీసుకొచ్చి రోడ్డు పక్కన వదిలి వెళ్లిపోయారు. దీంతో చివరకు ఆ తండ్రి ‘అమ్మ ఒడి’ ఆశ్రమంలో చేరాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే రొడ్డ చెన్నయ్య (70) అనే వ్యక్తికి ఐదుగురు కుమారులు ఉన్నారు.
ఆయనకు ఉన్న 10 ఎకరాల పొలం నుంచి వచ్చే ఆదాయం అంతా కుమారులే తీసుకుంటున్నారు. వయస్సు మీదపడడంతో చెన్నయ్య నడవలేని స్థితిలో ఉన్నాడు. దానికి తోడు, చెన్నయ్యను ఆయన కోడళ్లు ప్రతిరోజు తిడుతూ చీదరించుకుంటున్నారు. చివరకు ఆయన ఇంట్లో ఉంటే తాము పుట్టింటికి వెళ్లిపోతామని భయపెట్టారు. దీంతో ఆ పుత్రరత్నాలు మల్లికార్జున సర్కిల్‌ సమీపంలోని వారపుసంత వద్ద ఆయనను వదలిలేశారు. స్థానికుల సాయంతో ఆ వృద్ధుడు ఆశ్రమంలో చేరాడు.

Kadapa District
father
sons
  • Error fetching data: Network response was not ok

More Telugu News